
ఏలూరు (Eluru, Ellore), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఏలూరు నందు ఒక ప్రభుత్వాసుపత్రి, జిల్లా కోర్టు, జిల్లా గ్రంధాలయము కలవు.
విషయ సూచిక
1 చరిత్ర
2 విశేషాలు
3 మండలంలోని పట్టణాలు
4 గ్రామాలు
5 పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు
హేలపురి (ఏలూరు) సనాతన కాలమునుండి వేంగి అను బౌద్ధ రాజ్యములో భాగముగా ఉన్నది. తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 700 నుండి 1200 వరకు కోస్తా ఆంధ్రను పరిపాలించారు. ఏలూరు (హేలపురి) అప్పటి చాళుక్య సామ్రాజ్యములో ఒక ప్రాంతముగా ఉండేది. 1471లో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యములో భాగముగా ఉన్నది. ఆ తరువాత గజపతుల చేతుల్లొకి వచ్చి వారి పరిపాలనలో ఉన్నది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొనెను. ఆ తరువాత గోల్కొండ నవాబు కుతుబ్ షా వశమైనది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగిమరియు గుంటుపల్లి (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు కలవు.
ఎంతో ప్రసిద్దిచెందిన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్‌రెడ్డి) కళాశాల ఏలూరులో కలదు. ఈ కళాశాల నందు సినీనటులు కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు, మురళీ మోహన్ మరియు ఇంకెందరో ప్రముఖులు పట్టభధ్రులు అయ్యారు.
జిల్లాలోనే పెద్దదైన అల్లూరి సీతారామరాజు స్టేడియం కలదు.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు ఏలూరుని ఆనుకొని ఉంది.
మండలంలోని పట్టణాలు
ఏలూరు(m+og)
ఏలూరు (m)
గ్రామాలు
చాటపర్రు
చోదిమెళ్ళ
ఏలూరు
గుడివాకలంక
జాలిపూడి
కలకుర్రు
కట్లంపూడి
కొక్కిరాయిలంక
కొమడవోలు
కోమటిలంక
మాదేపల్లి
పాలగూడెం
మల్కాపురం
మనూరు
పోణంగి
ప్రత్తికోళ్ళలంక
పైడిచింతపాడు
శనివారపుపేట
శ్రీపర్రు
పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు
జీలుగుమిల్లి బుట్టాయగూడెం పోలవరం తాళ్ళపూడి గోపాలపురం కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం టి.నరసాపురం చింతలపూడి లింగపాలెం కామవరపుకోట ద్వారకా తిరుమల నల్లజర్ల దేవరపల్లి చాగల్లు కొవ్వూరు నిడదవోలు తాడేపల్లిగూడెం ఉంగుటూరు భీమడోలు పెదవేగి పెదపాడు ఏలూరు దెందులూరు నిడమర్రు గణపవరం పెంటపాడు తణుకు ఉండ్రాజవరం పెరవలి ఇరగవరం అత్తిలి ఉండి ఆకివీడు కాళ్ళ భీమవరం పాలకోడేరు వీరవాసరము పెనుమంట్ర పెనుగొండ ఆచంట పోడూరు పాలకొల్లు యలమంచిలి నరసాపురం మొగల్తూరు
వర్గాలు: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు
English
ఈ పేజీకి 21:35, 27 ఫిబ్రవరి 2007న చివరి మార్పు జరిగినది.
విషయ సంగ్రహం GNU Free Documentation License కి లోబడి లభ్యం.
వికీపీడియా గురించి
Retrieved from "http://te.wikipedia.org/wiki/à°à°²à±‚à°°à±"
No comments:
Post a Comment